కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు..! 18 h ago
TG : కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సీసీ టీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ను విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూంలో లాయర్ కూర్చునేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. కేటీఆర్ ఓగదిలో, లాయర్ మరో గదిలో ఉండాలని హైకోర్టు సూచించింది. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు హైకోర్టు అనుమతివ్వలేదు. ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకు రావొచ్చని న్యాయస్ధానం పేర్కొంది.